![]() |
![]() |

స్టార్ట్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -363 లో.. అమూల్యకి పెళ్లిచూపులు జరుగుతుంటే నాక్కూడా పెళ్లిచూపులు జరిగి ఉంటే ఎలా ఉంటుందోనని ప్రేమ ఉహించుకుంటుంది. తన పుట్టింటికి ధీరజ్ ఫ్యామిలీతో వచ్చినట్లుగా, ధీరజ్ అన్ని ప్రశ్నలు అడుగుతుంటే ప్రేమ వెటకారంగా సమాధానం చెప్పినట్లు ఉహించుకొని నవ్వుకుంటుంది. ప్రేమ అలా నవ్వడం చూసి ఏమైందని నర్మద అడుగుతుంది. మాకు పెళ్లిచూపులు జరగలేదు కదా.. అందుకే ఒకసారి పెళ్లిచూపులు జరిగితే ఎలా ఉంటుందో ఉహించుకున్నాను.. అందులో ధీరజ్ నన్ను పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడుతున్నాడని నర్మదతో ప్రేమ చెప్తుంటే ధీరజ్ వింటాడు.
మరొకవైపు కామాక్షి కోపంగా ఇంటికి వస్తుంది. తన కోసం భాగ్యం వాళ్ళు ఎదురుచూస్తారు. తను రాగానే నిన్నుపిలవకుండా నీ చెల్లికి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తున్నారు. ముందు వెళ్లి మీ అమ్మ దగ్గర తేల్చుకోమని శ్రీవల్లి అంటుంది. దాంతో కామాక్షి కోపంగా వేదవతి దగ్గరికి వెళ్తుంది. నాకు తెలియకుండా ఇలా ఎందుకు చేశారని అడుగుతుంది. ఇలా వచ్చి అక్క కట్నం.. ఆడపడుచు కట్నం.. అంటే బాగుండదు కదా.. అందుకేనని వేదవతి అంటుంది. నేను ఇక ఈ ఇంట్లో అడుగుపెట్టనని కోపంగా కామాక్షి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
కామాక్షి బయటకు వెళ్తుంటే అలా వెళ్తే నువ్వు కట్నాలు చాలా మిస్ అవుతావని భాగ్యం అనగానే మళ్ళీ వెనక్కి వెళ్తుంది. అమూల్య నిన్ను రెడీ చేస్తానని కామాక్షి అంటుంది. తను రెడీ అయింది కానీ నిన్ను రెడీ చేస్తానని కామాక్షిని భాగ్యం అందంగా రెడీ చేస్తుంది. హాల్లోకీ అమూల్య, కామాక్షి, శ్రీవల్లి ఇలా ముగ్గురు వస్తుంటే.. అబ్బాయి కామాక్షిని పెళ్లి కూతురు అనుకుంటాడు. అమూల్య కూల్ డ్రింక్ ఇవ్వమని వేదవతి చెప్తుంటే.. వద్దు తనే ఇవ్వాలి.. కాబోయ్ పెళ్లికూతురు ఇస్తే బాగుంటుందని అబ్బాయి కామాక్షిని ఉద్దేశించి అంటుంటే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |